Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedవార ఫలాలు (11-01-2026 నుండి 17-01-2026 వరకు)

వార ఫలాలు (11-01-2026 నుండి 17-01-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మేష రాశి వారు ఈ వారం వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపార పరంగా గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వీరికి ఏలినాటి శని నడుస్తుంది అయినా కూడా ఈ వారం వీరికి అనుకూలంగానే ఉంది. చేపట్టిన పనులు జాప్యం లేకుండా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ స్థాయిని సంపాదించుకునేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం అధికంగా ఉంటుంది మీకు రావలసినదనం సమయానికి చేతికి అందుతుంది. విదేశాలలో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది దీనికి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవటం అలాగే దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం మంచిది. అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వీరికి రావలసిన బెనిఫిట్స్ వస్తాయి భూ సంబంధిత విషయ వ్యవహారాలు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎన్నో రకాలుగా బాధపడుతున్న వారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం, ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి సరస్వతి మాతకు పూజ చేయటం కానీ హోమం చేయడం కానీ మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్లండి మంచి ఫలితాలు కలుగుతాయి

వృషభ రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. కుటుంబం పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా స్థిరాస్తుల పరంగా రావలసిన బెనిఫిట్స్ వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి ఒక స్థిరాస్తిని అమ్మి వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రయత్నాలు ఫలిస్తాయి. వచ్చినా అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు నలుగురితో కలిసి సరదాగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అనే భావన కలుగుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి. రూపాయికి 80 పైసలు ఖర్చు ఉంటుంది 20 పైసలు పొదుపు చేయగలుగుతారు. డబ్బుని ఎవరికైనా అప్పుగా ఇవ్వకండి అది తిరిగి రాదు. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్లు రావటం లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వివాహానికి సంబంధించి సంబంధం చేతిదాకా వచ్చి చేజారిపోతుంది. ఒకంతుకు మన మంచికే అనుకోండి. తర్వాత మంచి సంబంధం కోసం ప్రయత్నం చేయండి ఫలితం ఉంటుంది. అదేవిధంగా సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ వీరికి తప్పకుండా లభిస్తాయి. కష్టపడి పైకి రావాలనుకునే భావన నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం పట్టించడం దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అనవసర ఆలోచనలు చేయకండి. ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయటం, అలాగే కాలభైరవాష్టకం చదవటం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.

మిధున రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రాశి వారికి కాలం అనుకూలంగా లేదు. సలహా మేరకు ఉగాది తర్వాత నూతన వ్యాపార ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబీకుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వివాహానికి సంబంధించిన విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తపడాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంతా అనుకూలంగా లేదు పరీక్షలకు వెళ్లేటప్పుడు భగవన్నామ స్మరణ చేసుకొని వెళ్ళండి అంత మంచే జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కొంతమేరకు అనుకూలంగా ఉంటుంది. వీరికి జీవిత భాగస్వామి అండదండలు ఉండటం వలన మంచి జరుగుతుంది. మీరు ముందుకు వెళ్లటానికి వారి సహాయం ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసే వారు మంచి శుభవార్త వింటారు. ఈ రాశి వారు తమ సంతానానికి వివాహం చేయాలని అనుకుంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయటం అలాగే హనుమాన్ చాలీసా పటించడం మంచిది. విద్యార్థిని విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం చేతికి అందుతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి రావటం స్థిరాస్తుల విలువలు పెరగటం అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకోవడం జరుగుతుంది. వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని మీ ఆశ నెరవేరుతుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు వచ్చే విధంగా కాలం అనుకూలంగా ఉంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు కచ్చితంగా నెరవేరుతుంది గడిచిన వారాల కంటే కూడా ఈ వారం అధిక లాభాలు రావటం అలాగే పొదుపు చేయటం జరుగుతుంది. తోబుట్టువుల విషయంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పటించడం దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మానసిక వేదన బాగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పదిమంది సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయటం, కాలభైరవాష్టకం పటించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్, ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగాలలో మీకు రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వస్తాయి. రావలసిన ధనం కూడా చేతికి అందుతుంది. మీ మాట తీరుతో మీ ధైర్యంతో అందరిని మెప్పించగలుగుతారు. ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత పెడదోవ పట్టే విధంగా కనిపిస్తుంది. పిల్లల సంరక్షణ విషయంలో జాగ్రత్త వహించండి నూతన వ్యాపార ప్రారంభం కానీ నూతన ఉద్యోగానికి కానీ కొంత సమయం ఆగి ప్రయత్నించడం మంచిది. ఉద్యోగం పరంగా చిన్నచిన్న విభేదాలు తలెత్తుతాయి వాటి వల్ల ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశి వారు దైవదర్శనాలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తోబుట్టువుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తి తగాదాల మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయి. ఈ రాశి లోని విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యవహారాల ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికను ఇప్పటినుంచే సిద్ధం చేసుకోండి. వాయిదాలు వేసుకోవడం మంచిది కాదు. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రం పటించడం దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కాస్త చికాకు ఏర్పడుతుంది వ్యాపారంలో కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు తలెత్తుతాయి. కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రస్తుత గ్రహ ప్రభావాల వలన వ్యాపారపరంగా ఉద్యోగ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నాయి. సంతానంపరంగా మనస్పర్ధలు ఏర్పడతాయి. ఈ రాశి వారు ప్రతిరోజు అష్టమూలికా తైలంతో నలుపు వత్తులతో దీపరాధన చేయండి మంగళవారం నాడు నిమ్మకాయ డొప్పలలో నువ్వుల నూనె పోసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపారాధన చేయండి ఆరోగ్యపరంగా కెరియర్ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరంగా రావలసిన బెనిఫిట్స్ వస్తాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు మాత్రం కాలం అనుకూలంగా లేదు కొంత సమయం వేచి ఉండటం మంచిది. ప్రమోషన్స్ వస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ వారం సంతోషంగా గడుపుతారు దైవదర్శనాలు చేసుకుంటారు. రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప ఖర్చులు చేయకుండా ఉండండి. ఈ రాశి వారికి మానసిక సమస్యలు తలెత్తుతాయి జాగ్రత్త వహించండి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించకండి. భూ సంబంధిత విషయా వ్యవహారాలు సనుకుల పడతాయి. సొంతింటి కల నెరవేరుతుంది. నూతన వాహనం కానీ నూతన వస్త్రాభరణం కానీ కొనుగోలు చేస్తారు. బంధు వర్గం తోటి మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా చూసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారం గడచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్న వారికి చాలా చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్స్ కి సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు కాలభైరవాష్టకం పటించడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కాని శుక్రవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

తులా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఎంత కష్టపడితే అంతే వస్తుంది. ఈ రాశి వారు వ్యాపార పరంగాను ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. రావలసిన బెనిఫిట్స్ అలాగే వస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రేమ వివాహ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మనం చక్కగా ఉన్నా ఎదుటివారు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. పెళ్లి విషయంలో తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళటం మంచిది. మనకే అన్ని తెలుసు అనే ధోరణిలో ఉండకండి. విద్యార్థిని విద్యార్థులు కూడా ఇదే విధంగా ఉంటుంది చదువు మీద తప్ప వేరే వాటి మీద శ్రద్ధను ఉంచకండి. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు ముందర ఉన్నాయి కావున చదువు మీద శ్రద్ధ పెడితే ఫ్యూచర్ బాగుంటుంది. ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం పఠించడం చెప్పదగింది. అలాగే దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కాలం చాలా చక్కగా కలిసి వస్తుంది. బ్యూటీషియన్సు టెక్నీషియన్సు సినీ కళా రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా కాస్మోటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ రంగాల వారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఈ రాశి వారికి అదృష్టం పెద్దగా కలిసి రాదు మీరు పట్టు వదలకుండా కష్టపడితే అనుకున్న ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా చక్కగా ఉంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంది. గడచిన కొన్ని వారాల కంటే ఈ వారం వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. అప్పులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని చదవండి కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ . ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల దూర ప్రాంత ప్రయాణాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టి అప్పటికప్పుడే పూర్తి చేయండి వాయిదాల పద్ధతి సరైనది కాదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలలో చదవాలనుకునే వారికి వీసా పరంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయటం సుబ్రహ్మణ్యం స్వామి హోమం చేయించడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. తోబుట్టువుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఒక రూపాయికి 30 రూపాయలు ఖర్చవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధిత వ్యవహారాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయటం అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి 8 వారాలు అభిషేకం చేయటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కంకణం కానీ రూపును కానీ మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడూ కలిసివచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది . మీ గురించి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి రావలసిన బెనిఫిట్స్ సకాలంలో వస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఉంటుంది ఎప్పుడో ఇచ్చిన ధనం తిరిగి చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగాలలో మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా సానుకూల పడతాయి. ఎక్కువగా ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది అలాగే స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. కష్టానికి తగిన ప్రతిఫలం కనిపించే విధంగా ఈ వారం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విషయంలో భూమి గానీ ఇల్లు గానీ కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టేఫలి అన్నట్టు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి సంబంధించిన విషయాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంత వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏమి చేసినా దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. వివాహ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి జాగ్రత్త వహించండి. సినీ కళా రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్స్ కాస్మోటిక్ కూరగాయ వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఈ వారం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపరంగా ముఖ్యంగా సైనస్ ఎసిడిటీ అజీర్ణం విషయాలలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రం హనుమాన్ చాలీసా పటించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలుస వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు ముఖ్యంగా లైట్ కలర్స్ ధరించడం మంచిది.

మకర రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. మీ ప్రతిభకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఏదైనా నూతన పని ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి ప్రతి మంగళవారం. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలవు కలుగుతాయి.

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో రాణిస్తారు లాభాలు మీరు ఆశించిన విధంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభాల బాటలో ఉంటాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పొదుపు చేయడంలో విఫలమవుతారు. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. సమాజ సేవలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీకు తోచిన విధంగా సహాయం చేస్తారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామివారికి వడమాల సమర్పించండి. నలుపు రంగు వత్తులతో శని గ్రహం దగ్గర దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం గానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments