
ఖమ్మం నగరంలో నూతన సంవత్సరం రోజు దారుణ ఘటన చోటు చేసుకుంది.భూ వివాదం నేపధ్యంలో ఒక వ్రద్దురాలిని పట్టపగలే హత్య చేసిన సంఘటన కలకలం స్రష్టించింది. వివారాల్లోకి వెళ్ళితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడేనికి చెందిన మోటె రాములమ్మ (70), యాదగిరి దంపతులు జీవనోపాధి నిమిత్తం పదేళ్ళ క్రితం ఖమ్మం నగరానికి వచ్చి బొక్కలగడ్డ ప్రాంతంలో స్ధిరపడ్డారు. యాదగిరి తో పాటు ఆయన సోదరులకు కలిపి నాతాళ్లగూడెంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని యాదగిరి మరణానంతరం అతని భార్య రాములమ్మ తన కుమార్తె పేరు మీద రిజిస్టర్ చేసింది. అన్నదమ్ముల్లో యాదగిరి పెద్దవాడు కావడంతో ఆయన మరణానంతరం ఆయన భార్య రాములమ్మ ఈ భూమిని తన కూతురు కి అప్పగించింది. అయితే ఈ భూమి విషయంలో యాదగిరి సోదరుల వారసుల మధ్య గత కొంతకాలం నుంచి వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాములమ్మ తనకు రాసిన ఐదెకరాల భూమిని ఆమె కూతురు సేద్యం చేసుకుంటుండడంతో యాదగిరి సోదరుల కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరింది.
దీంతో గ్రామ పెద్దలు ఇటివలనే ఈ విషయంలో పంచాయతీ ని ర్వహించి, సమస్య పరిష్కారమయ్యేవరకు భూమిని ఎవరూ సేద్యం చేయవద్దని తీర్మానించారు. అయినప్పటికీ రాములమ్మ కూతురు మరోసారి ఆ భూమిలో పంట సాగు చేసింది. ఈ విషయంలోనే రాములమ్మ మరిది కొడుకు శేఖర్ కూడా పంచాయతీకి దిగాడు గురువారం సాయంత్రం బొక్కల గడ్డలో రాములమ్మ తన ఇంటి ముందు కూర్చుని మిరపకాయల తొడిమలు తీస్తుండగా, శేఖర్ అక్కడికి వచ్చి భూవిషయంపై పెద్దమ్మ రాములమ్మతో వాగ్వాదానికి దిగాడు. ముందస్తుగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో శేఖర్ రాములమ్మ కడుపులోబలంగా పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాములమ్మ నడిరోడ్డుపై అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోయింది. ఈ ఘటనను అడ్డుకోవడానికి వె ళ్లిన తనను మహేష్ అనే వ్యక్తిని కూడా శేఖర్ క త్తితో గాయపరిచాడు. ఈ ఘటన అనంతరం నిం దితుడు శేఖర్ త్రీ టౌన్ పోలీసులకు లొంగిపోయా రు. త్రీటౌన్ సి ఐ సంఘటన స్ధలాన్ని సందర్శించా రు. శేఖర్ పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ న మోదై ఉన్నట్లు తెలిసింది త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




