Monday, June 15, 2026
Google search engine
HomeUncategorizedఅఖిలేష్ మాకు స్ఫూర్తి : కెటిఆర్

అఖిలేష్ మాకు స్ఫూర్తి : కెటిఆర్

శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టిన అఖిలేష్ తీరు తమకు స్ఫూర్తిదాయకమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదే స్ఫూర్తితో బీఆర్‌ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ నేతలు అఖిలేష్ కి సాధారణంగా స్వాగతం కలిపి ఆయనతో వివిధ అంశాల పైన చర్చించినట్లు కేటీఆర్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ గారితో సమావేశం అవుతారని తెలిపారు. ఈరోజు తనతోపాటు తన పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి మా పార్టీ ఆతిథ్యం స్వీకరించినందుకు అఖిలేష్ యాదవ్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

బంజారా హిల్స్ లోని కేటీఆర్ ఇంటి వద్ద అఖిలేష్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే అఖిలేష్ యాదవ్ కెసిఆర్‌తో సమావేశం అవుతారని, ఈసారి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్‌కి మేమే స్వాగతం పలుకుతామంటే ఆయన స్వయంగా వచ్చి కలుస్తానని, మీతో చర్చిస్తానని అన్నారని, తమ పార్టీ నేతలు అఖిలేష్ యాదవ్ కి సాదరంగా స్వాగతం తెలిపారన్నారు. ఒకప్పుడు శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంటులో తక్కువ సీట్లు సాధించినా ప్రజల వెంట నిలబడినందుకు అఖిలేష్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలిపించుకుని దేశంలోని మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. అఖిలేష్ యాదవ్ పార్టీస్ఫూర్తితో భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతుందని, ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు పొందుతామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments