
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంది. ఒలింపిక్ కలను నెరవేర్చుకునేందుకు మళ్లీ రింక్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ రజతం ఖాయం చేసుకుంది. కానీ రెండో రోజు బరువు చూసే సమయానికి గ్రాములు అదనంగా ఉండడంతో వినేశ్‌పై అనర్హత వేటు పడింది. దీంతో మనో వేదనకు గురైన రెజ్లింగ్ నుంచి తప్పుకుంది. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి రెజ్లింగ్‌లో ప్రవేశించేందుకు సిద్ధమైంది. రానున్న ఒలింపిక్స్ కోసం త్వరలోనే సాధన ప్రారంభిస్తానని తెలిపింది.




