Wednesday, April 22, 2026
Google search engine
HomeUncategorized68,000 మంది ఉద్యోగుల జీతాలను నిలిపివేసిన యోగి సర్కార్

68,000 మంది ఉద్యోగుల జీతాలను నిలిపివేసిన యోగి సర్కార్

ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 68,236 మంది రాష్ట్ర ఉద్యోగుల జీతాలను నిలిపివేయడం సంచలనం కల్గించింది. ఇది వివిధ విభాగాలలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. జనవరి 31 లోగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు అంతా, తమతమ ఆస్తుల వివరాలను ప్రకటించాలన్న ప్రభుత్వం ఆదేశాన్ని పాటించక పోవడంతో ఈ చర్య తీసుకున్నారని తెలిసింది.ఉత్తరప్రదేశ్ లో మొత్తం 8,66,261 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జనవరి 31లోగా మానస్ సంవిదా పోర్టల్ లో ఉద్యోగులు అంతా తమ స్థిరాస్తులు, చరాస్తుల వివరాలను అప్ లోడ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిబంధనలు పాటించని వారి జీతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జీతాలు నిలిచి పోయిన ఉద్యోగులలో, అత్యధిక సంఖ్యలో క్లాస్ 3 కు చెందిన వారే 34,926 మంది ఉన్నారు. ఇతరులలో క్లాస్ 2 ఉద్యోగులు 724 మంది, క్లాస్ 1 ఉద్యోగులు 2,628 ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments