
తెలంగాణ చరిత్రలో దీక్ష దివాస్ నవంబర్ 29 ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న దీక్ష దివాస్ జరుపుకుంటున్న ఆ రోజే తెలంగాణ కెసిఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు విద్యార్థి అమరవీరుల త్యాగఫలం చాలా గొప్పదని పేర్కొన్నారు. దీక్ష దివాస్‌ను అన్ని యూనివర్సిటీలు, అన్నీ కాలేజీల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ కోసం చేసిన త్యాగాలను కెసిఆర్ పాత్రను వివరించాలని, యువకులకు ఉద్యమ కాలంలో జరిగిన త్యాగాల గురించి తెలియజేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై మనకున్న ప్రేమ ఇతరులకు ఉండదని, రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనదేనని కెటిఆర్ ఉద్ఘాటించారు. ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారు అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ అరాచకాలపై పోరాడి, ప్రతి విద్యార్థి ఒక యోధుడిగా ఎదగాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.




