
భారత మహిళ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వివాహనికి కొంత సమయం ముందే ఆమె తండ్రి అనారోగ్యానికి గురి కావండతో వివాహాన్ని వాయిదా వేశారు. అయితే తన పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లను స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పలాశ్ ముచ్చల్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధృవికరిస్తూ స్మృతి ఇటీవల తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. సహచర క్రికెటర్లతో కలిసి ‘సమ్‌జో హో హి గయా’ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆమె ఇన్‌స్టా ఖాతాలో కనిపించడం లేదు. అయితే ఈ వీడియోని ఆమె డిలీట్ చేసిందా.? లేదా హైడ్ చేసిందా.? అనే విషయంపై క్లారిటీ లేదు. అంతేకాదు స్మృతి స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక కూడా తమ సోషల్‌మీడియా ఖాతాల్లో ఈ వీడియోని తొలగించడం గమనార్హం. మరోవైపు పలాశ్ స్మృతికి ప్రపోజ్ చేసిన వీడియో మాత్రం అతని ఖాతాలో కనిపిస్తోంది. మరి స్మృతి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.




