
ఢాకా: భారత మహిళ కబడ్డీ జట్టు మరోసారి తన సత్తా చాటుకుంది. ఢాకా వేదికగా కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీని చిత్తుగా ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 35-28 పాయింట్ల తేడాతో భారత మహిళ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో ఆరంభం నుంచి భారత్ తన ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. గ్రూప్ స్టేజీలో థాయ్‌లాండ్‌పై 65-20, బంగ్లాదేశ్‌పై 43-18, జర్మనీపై 63-22, ఉగాండాపై 51-16 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇక సెమీఫైనల్‌లో ఇరాన్‌తో తలపడిన భారత్ 33-21 తేడాతో నెగ్గింది. ఇక ఫైనల్‌లోనూ భారత్ దూకుడు తగ్గలేదు. చైనీస్ తైపీని ముప్పుతిప్పలు పెట్టింది. ఫలితంగా 35-28 పాయింట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను మద్దాడింది భారత్. ఈ సందర్భంగా భారత మహిళ కబడ్డీ ఆటగాళ్లు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.




