Monday, December 1, 2025
Google search engine
HomeUncategorizedహిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానం.. ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానం.. ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై విచారణ కోరుతూ ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టు నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)ను ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ ఫేక్ అయ్యి ఉండి అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నెంబర్లు 52/2025, 53/2025లో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని న్యాయవాది ఆరోపించారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సి గైడ్‌లైన్స్ ప్రకారం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, దర్యాప్తు కూడా తటస్థ అధికారుల ద్వారా జరగలేదని పేర్కొన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు నిజాలు తెలియాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయవాది విజయ్ కిరణ్ మాట్లాడుతూ హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అసలు సమాచారం, సాక్షాలు ప్రజలకు వెల్లడించాలి.

ఫేక్ ఎన్‌కౌంటర్ అయితే అది ప్రభుత్వం నుండి జరిగిన చారిత్రాత్మక తప్పిదం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే నేరమే అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసు కోవడం మావోయిస్టులైనా, పోలీసులైనా నేరమే. ఎవరూ చట్టానికి పైబడిన వారు కాదన్నారు. ఈ మొత్తం కేసు వ్యవహారాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సి దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. అయితే, ఈ ఫిర్యాదు నేపథ్యంలో హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అధికారిక దర్యాప్తు చేపడుతుందా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, ఈ వ్యవహారంతో కేసు ఇప్పుడు జాతీయ దృష్టిలో పడినట్లయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments