
భారత్, సౌతాఫ్రికా మధ్య ప్రస్తుతం రెండు టెస్ట్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. అయితే సఫారీలతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పి కారణంగా అతను మైదానరం వీడాడు. ఆ తర్వాత వైద్యుల పరిరక్షణలో ఉన్నాడు. రెండో టెస్ట్ కోసం కోల్‌కతా నుంచి గౌహతి వచ్చిన గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కొత్త కెప్టెన్‌ని నియమించారు. టీం ఇండియా స్టార్ కీపర్, బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అంతేకాక.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్‌కి జట్టులో చోటు కల్పించారు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కీపర్, కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధృవ్ జురెల్.




