
నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితుల వద్ద నుంచి ఎస్‌ఆర్‌ఎం, బెంగళూరు సిటీ యూనివర్సిటీల సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మీర్జా అక్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం- ప్రధాన నిందితుడు, మహ్మద్ అజాజ్ అహ్మద్, – వడ్డేపల్లి వెంకట్ సాయి, విస్టాలా రోహిత్ కుమార్, సత్తూరి ప్రవీణ్‌ని అరెస్టు చేశారు. వెంకట్, రోహిత్, ప్రవీణ్ – నకిలీ బి.టెక్ సర్టిఫికెట్‌ను కొనుగోలు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు నార్సింగి పోలీసులకు సమాచారం రావడంతో నార్సింగిలోని చింతచెట్టు ప్రాంతంలో నకిలీ సర్టిఫికేట్లు అవసరం ఉన్న వారికి ఇచ్చేందుకు వచ్చిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. యబడ్డాయి. సులభంగా డబ్బులు సంపాదించేందుకే నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమండ్ విధించింది.




