
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది. సిఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌ల మధ్య వ్యక్తిగతంగా, పార్టీలో విభేదాలు తీవ్రం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. దీంతోపాటు నేడు (ఆదివారం) ఉదయం పుట్టపర్తి సాయిబాబా ఉత్సవాల్లో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొని నేడు (ఆదివారం) సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్టుగా తెలిసింది.




