Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedకొండాపూర్‌లో రూ. 700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

కొండాపూర్‌లో రూ. 700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

 రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్ల్లి మండలం కొండాపూర్‌లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కాజేయాలని చేసే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల మేర పార్కులు, ప్రజావసరాలకు స్థలాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్‌ను హైడ్రా ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పాతింది. ఈ ప్రాంతంలో ఎకరం రూ. 200ల కోట్లు వరకు ధర పలుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు రూ. 700ల కోట్ల వరకు ఉంటుందని అంచనాకు హైడ్రా వచ్చింది. కొండాపూర్ విలేజ్‌లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో వేంకటేశ్వర హెచ్ ఏ ఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు. 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు.. 1000 చ.గ.ల మేర ప్రజావసరాలకు స్థలాలను కేటాయించారు. ఇప్పుడవే ఆక్రమణలకు గురయ్యాయి. పార్కులను బైనంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఇదే విషయమై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వేంకటేశ్వర హెచ్‌ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో సంబంధిత ప్రత్రాలతో ఫిర్యాదు చేశారు.

హైకోర్టు ఆదేశాల ప్రకారమే చర్యలు….

ప్రజావాణి ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారినట్టు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇతరుల దగ్గర నుంచి వైబీకే రావు జీపీఏ కుదుర్చుకుని 1980 దశకంలో లే ఔట్ వేశారు. ఆ లేఔట్ ప్రకారం ప్లాట్లు కొన్నవారు ఆయా ప్లాట్లను, నిర్మించిన భవనాలను ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ద్వారా రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. 1.20 ఎకరాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడదీసి 11 ప్లాట్లు చేసి అమ్మేసినట్టు నిర్ధారణ అయింది. మరో రెండు పార్కులను కూడా అలాగే బై నంబర్లతో పలువురికి అమ్మేశారు. ఇక్కడ లావాదేవీలు నిర్వర్తించిన వారికి ఎన్.ఆర్.ఐ. లే ముడిసరుకుగా మారారని అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా అధికారులకు తెలిపారు. ఇక వీళ్ల దగ్గర నుంచి సింహా డెవలపర్స్ , వాసవి నిర్మాణ సంస్థలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కొని బౌచర్లను పెట్టి.. పార్కులవైపు మళ్ళ డం కాదు కదా.. చూడ్డానికి కూడా అవకాశం లేకుండా చేశారని.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారుల ముందు అక్కడ నివాసం ఉన్న వారు వాపోయారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్కులతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలని హైకోర్టు కూడా సూచించింది. హైడ్రాను ఈ దిశగా మార్గంసుగమం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులను హైడ్రా ఏర్పాటుచేసింది. దీంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. ఫిర్యాదు చేసిన వెంటనేహైడ్రా స్పందించి పార్కులను కాపాడిందంటూ దన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments