
భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో గెలిచిన సఫారీ జట్టు శనివారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది.
వన్డే జట్టుకు కెప్టెన్‌గా టెంబా బవుమా, టి-20 జట్టుకు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టి-20 జట్టులో ఎంపికయ్యాడు. తాజాగా పాకిస్థాన్‌పై ఆరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.
నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే రాంచీ వేదికగా జరగగా.. డిసెంబర్ 3, 6 తేదీల్లో రాయ్‌పూర్, విశాఖ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఐదు టి-20ల సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.
భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:
టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్ సుబ్రాయన్.
భారత్‌తో జరిగే టి-20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్.




