
బొగ్గు లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం గుండా వెళ్లే జాతీయ రహదారి పై , అయ్యప్ప ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బొగ్గు లోడ్ తో, చంద్రాపూర్ నుండి నాందేడ్ వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.




