
బైక్ తో పాటు యువకుడు డ్రైనేజీలో పడి మృతి చెందిన సంఘటన వేములవాడలోని బతుకమ్మ తెప్ప ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున స్థానికులు డ్రైనేజీలో యువకుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంబించారు. మృతుడు వేములవాడకు చెందిన అభినవ్ గా పోలీసులు గుర్తించారు. స్థానిక ఆలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదానికి సంబంధించి సిసిటివి పుటేజి రికార్డు పోలీసులకు అభ్యం అయింది.బైక్ అదుపు తప్పి డ్రైనేజీలో పడడంతో యువకుడికి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.




