
పాట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. మరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డిఎ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. తమ కూటమి నేతగా నితీశ్‌ను ఎన్నుకున్నారు. మరికొద్ది సేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లేఖ అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గురువారం పదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.




