
పత్తి రైతులు ఎవరూ దిగులు చెందరాదని, మార్చి వరకూ మొత్తం పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు భరోసా ఇచ్చారు. పత్తి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రైతులను కోరారు. పత్తి రైతులు తమ వద్ద ఉన్న పత్తి విక్రయానికి కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన బుధవారం పార్టీ నాయకులు ఎన్‌వి సుభాష్, మల్లారెడ్డి, జగ్‌మోహన్ సింగ్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు ‘బంద్’ విధించి, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. రుణ మాఫీ అమలు చేయకపోవడంతో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో వత్తిడికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమని అన్నారు.
మరోవైపు బిఆర్‌ఎస్ తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించిన ఘన చరిత్ర ఆ పార్టీకి ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పత్తి రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పత్తి దిగుబడి ఎంత వచ్చినా సిసిఐ కొనుగోలు చేస్తుంది కాబట్టి పత్తి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సిసిఐ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లను, జిన్నింగ్ మిల్స్, ఎంఎస్‌పి అమలుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలా చర్యలు చేపట్టారని రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు వందలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనట్లు ఆయన వివరించారు. వరకు కేవలం లక్షల బేళ్ళు మాత్రమే కొనుగోలు జరిగితే, నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్షల బేళ్ళు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా చేసేందుకు, మిల్లుల వద్ద రద్దీ, గందోళగోళం లేకుండా చేసేందుకు వీలుగా కేంద్రం తీసుకుని వచ్చిన యాప్‌ను రైతులు ఉపయోగించుకోవాలని రాంచందర్ రావు తెలిపారు.




