
హైదరాబాద్: కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో విభజన రాజకీయాలతో అధికారం లోకి రాలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే జూబ్లీహిల్స్ లో బిజెపి ఓటమి పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ లో ఓటమితోనే బిజెపి పనైపోయినట్లు కాదని ఈటల అన్నారు. హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార పార్టీ డబ్బు, చీరలు పంపిణీ చేసి.. అధికార దుర్వినియోగం చేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు.




