
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 153 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 124 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లక్ష్య చేధనలో తడబడింది. 10 పరుగుల వద్దే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మూడో డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సుందర్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ, అతనికి వేరే ఆటగాళ్ల నుంచ సరైన సహకారం అందలేదు. వరుసగా భారత్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివర్లో అక్షర్ పటేల్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, రెండు సిక్సులు బాదాడు. కానీ, అదే ఓవర్‌లో అక్షర్ భారీ షాట్‌కి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే చివరి బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన సిరాజ్ మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్‌కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇండియా ఇన్నింగ్స్ 9 వికెట్ల నష్టానికి 93 పరుగుల వద్ద ముగిసిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్ స్కోర్
దక్షిణాఫ్రికా : 159/10
భారత్: 189/10




