
అమరావతి: ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. మన రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. చాయ్ వాలా నరేంద్రమోడీ ప్రధాని అయ్యారంటే అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని కొనియాడారు. దేశంలో ఎన్నో పాలసీలు చూశానని, ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2014లో.. 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 4వస్థానానికి చేరిందని చంద్రబాబు తెలియజేశారు. వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతోందని, 2038 నాటికి ప్రపంచంలో భారత్.. రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోందని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.




