Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedపంత్ నయా రికార్డు.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

పంత్ నయా రికార్డు.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా కీపర్ రిషబ్ పంత్ నయా రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యథిక సిక్సులు కొట్టిన ఆటగాడినగా పంత్ చరిత్రల్లోకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. సెహ్వాగ్ భారత్ తరఫు టెస్టుల్లో 90 సిక్సలు కొట్టగా.. పంత్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు సిక్సులు కొట్టి.. 92 సిక్సులతో ఆ రికార్డను బ్రేక్ చేశారు. ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న పంత్.. 2 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 189 పరుగులకు ఆలౌటై 30 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు అద్భత ప్రదర్శన చేస్తున్నారు. స్పిన్నర్ల ధాటికి సౌతాఫ్రికా 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments