
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వీటితో పాటు ‘సలార్-2’, ‘కల్కి-2’ సినిమాల్లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లో ప్రభాస్ మరో సినిమాకు ఒకె చెప్పారని టాక్ వినిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ అంటూ స్టెప్పులేయించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘ది రాజసాబ్’ షూటింగ్ సమయంలో ప్రేమ్ రక్షిత్, ప్రభాస్‌కి కథ చెప్పగా.. ఆ కథ ప్రభాస్‌కి నచ్చి వెంటనే ఒకె చెప్పేశారట. అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. అయితే బాహుబలి తర్వాత ‘కల్కి’ మినహా ప్రభాస్‌కు ఆ రేంజ్‌లో ఏ సినిమా హిట్ కాలేదు. దీంతో ఇప్పుడు ప్రేమ్ రక్షిత్‌తో సినిమా ఒకె చెప్పడంపై ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇది కేవలం ఓ యానిమేషన్ సినిమా అని అందులో ప్రభాస్ కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చందుకు ఓకే చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి.




