
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి మరోసారి తనకు తానే సాటి అని నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అయితే భారత బౌలర్లు సఫారీ బ్యాటర్లకు క్రీజ్‌లో కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. రెండో సెషన్ ముగిసే సమయానికే సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే మూడో సెషన్‌లో 55వ ఓవర్ వేసిన బుమ్రా అదే ఓవర్‌లో 3 బంతికి హార్మర్(5)ని క్లీన్ బౌల్డ్ చేయగా.. చివరి బంతికి మహరాజ్(0) ఎల్‌బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికా 55 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో బుమ్రా 5, సిరాజ్, కుల్దీప్ చెరి 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. బుమ్రా కెరీర్‌లో ఇది 16వ ఐదు వికెట్ల హౌల్ కావడం విశేషం.




