
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బుమ్రా ఐదు వికెట్ల పడగొట్టి సఫారీలను చిత్తు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. నిదానంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అయితే జెన్సన్ బౌలింగ్‌లో ఓపెనర్ జైస్వాల్(12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బ్యాటర్‌గా వాషింగ్టన్ సుందర్‌ని బరిలోకి దింపారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి 122 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్‌లో రాహుల్(13), సుందర్(6) ఉన్నారు.




