
హైదరాబాద్: ఆర్టిసి రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాలనీలకు బస్సు రూట్ లు పెంచేలా అధ్యయనం చేయాలని అన్నారు. ఆర్టిసి ఉన్నతాధికారులతో పొన్నం సమీక్షా సమావేశం జరిపారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పిరియడ్ రెండేళ్లకు తగ్గించాలని, నష్టాల్లో ఉన్న డిపోలు లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ జరుగుతుందని తెలియజేశారు. ఆరాంఘర్ బస్సు టెర్మినల్ కోసం పోలీసు శాఖ భూములపై చర్చలు జరపాలని, హైదరాబాద్ కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి.. కలెక్టర్లతో నివేదిక ఇవ్వాలని అధికారులకు పొన్నం ఆదేశించారు. బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేస్తామని, త్వరలో ఆర్టిసి డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడంతో పాటు బస్సు సౌకర్యాల పై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.




