
హైదరాబాద్: నల్గొండ జిల్లా లో రోడ్డు చందంపేట మండలం బుగ్గతండా వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పత్తి ఏరివేతకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. గమనించిన స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలకు వెళితే.. క్షతగాత్రులు పెద్ద ఆడిషర్లపల్లి మండలం పెద్దగుమ్మడం వాసులుగా పోలీసులు గుర్తించారు.




