Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedయువత సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుంది: శ్రీధర్ బాబు

యువత సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుంది: శ్రీధర్ బాబు

హైదరాబాద్: యువత సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉన్నతస్థానానికి చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కష్టపడాలని యువతకు సలహా ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వినూత్య ఆలోచనలతో ముందుకొచ్చే వారికే ఉజ్జల భవిష్యతు ఉంటుందని వివరించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త విధానం తీసుకొచ్చామని, అంకుర పరిశ్రమలు వంద కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని, స్టార్టప్‌లకు సాయం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోందని, ఇతర దేశాల్లో అవకాశాల కోసం చూడవద్దని కోరారు. ఇతర దేశాలు భారత్‌పై ఆధారపడే స్థితికి మనం ఎదగాలన్నారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments