
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మరో రెండు రోజుల్లో టెస్ట్ సిరీస్ పకారంభం కానుంది. రెండు టెస్ట్‌ల సిరీస్ తర్వాత, మూడు వన్డేలు, ఐదు టి20ల్లో ఇరు జట్లు తలపడతాయి. గత 15 సంవత్సరాలుగా సౌతాఫ్రికా భారత్‌లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో కూడా గెలవలేదు. దీంతో ఈ సారి విజయం సాధించి చర్రిత సృష్టించాలని సఫారీ జట్టు భావిస్తోంది. ఈ విషయాన్ని జట్టు స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వెల్లడించాడు. ‘‘భారత్‌లో భారత్‌ను ఓడించాలని మా జట్టు ఉవ్విళ్లురుతుంది. ఇది చాలా కఠినమైన టూర్ అని తెలుసు. భారత్‌లో ఆడటం మాకు పరీక్షే. అయినా మమ్మల్ని మేం నిరూపించుకోవడానికి ఇదో అద్భుత అవకాశం’’ అని కేశవ్ పేర్కొన్నాడు.
ఇటీవలే సౌతాఫ్రికా.. పాకిస్థాన్‌లో పర్యటించింది. టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దీని గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్‌లో ఉన్నట్లు ఇక్కడ పూర్తి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు ఉంటాయని అనుకోవడం లేదు. భారత్‌లో మంచి పిచ్‌లు ఉంటాయి. ఆట సాగుతున్నకొద్ది వాటి స్వభావం మారుతుంది’’ అని కేశవ్ అన్నాడు. కోల్‌కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం అవుతుంది. గౌహటి వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి జరుగనుంది.




