
రెండోదశలో 122 స్థానాల్లో ఓటింగ్‌కు సర్వంసిద్ధం
చివరి రోజు ఎన్‌డిఎ, మహాకూటమి నేతల హోరాహోరీ ప్రచారం
14న ఎన్నికల ఫలితాలు
పాట్నా: బీహార్‌లో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రెండో తుది రౌండ్ పోలింగ్ ప్రచారం చివరి రోజున ఎన్‌డిఎ, ఇం డియా కూటమి అగ్రనేతలు పలు సభలలో గడు వు దాకా సభల్లో పాల్గొన్నారు. సాయంత్రంతో నెలరోజులుగా ఇక్కడ నెలకొని ఉన్న తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం, అధికారం కోసం ప్రత్యర్థుల స్థాయి హోరాహోరీ ముగిసింది. రెండో దఫా ఓటింగ్ మంగళవారం జరుగుతుంది. ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్‌లో బీహార్‌లో అత్యధిక స్థాయి లో దాదాపు 65 శాతం ఓటింగ్ రికార్డు అయిం ది. అప్పుడు 121 స్థానాల్లో తమ ప్రతినిధుల భ వితవ్యాన్ని ప్రజలు బ్యాలెట్ ద్వారా నిర్ధేశించి ఉంచారు. రెండో దఫాలో 122 స్థానాలకు పో లింగ్ జరుగుతుంది. దీనితో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలకు మరింత పదును పెట్టుకోవడం జరిగింది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర నేతలు ఎన్‌డిఎ తరఫున పలు సభల లో ప్రసంగించారు.
ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగా రు. ప్రధాని మోడీ, అమిత్ షాలపై ఓట్ల చోరీ ఆ రోపణలను తీవ్రతరం చేశారు. సీమాంచల్ ప్రాంతంలోని కిషన్‌గంజ్, పూర్ణియా జిల్లాల్లో ముస్లింల జనా భా ఎక్కువగా ఉండటంతో ఇక్క డ తమ స్థితిని పదిలపర్చుకునేందుకు ఇండియా కూటమి య త్నిస్తోంది. దీనికి ప్రతిగా బీహార్ ప్రగతిని ప్రధా న నినాదంగా చేసుకుని కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రచార రంగంలోకి దిగారు. వరుసగా 20 దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్ పాలన కొనసాగుతూ వస్తోంది. దీనిని ఇప్పుడు దెబ్బతీసేందుకు ప్రత్యేకించి ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తన స్థానికత బలంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. తండ్రి లాలూ సెంటిమెంట్‌ను జాగ్రత్తగా వాడుకున్నారు.
ఈ సారి ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు అ నేక మంది బీహార్‌లో ప్రచారం సాగించారు. డ బుల్ ఇంజిన్‌తోనే బీహార్ ప్రగతి సాగుతుందనే సంకేతాలు వెలువరించారు. పలువురు ఎన్‌డిఎ పాలిత సిఎంలు, మంత్రులు కూడా ప్రచారానికి వచ్చా రు. కాంగ్రెస్ సిఎంలు కూడా బీహార్ ప్రచారానికి దిగారు. ఎన్‌డిఎ, ఇండియా కూటమి మ ధ్య ఈసారి ఓటరు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఈ నెల 14వ తేదీన ఎన్నికల వెల్లడి అవుతుంది. ఈసారి ఎన్నికల ఫలితం ఇప్పటికైతే ఎవరికి అంతుచిక్కని ఉత్కంఠత రీతిలోనే ఉందని ఎన్నికల విశ్లేషకులు తెలిపారు.




