
ప్రస్తుత క్రికెట్‌లో బెస్ట్ బౌలర్ ఎవరని అడిగితే అంతా ముందుగా చెప్పేది జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. చిన్న, పెద్ద అంతరూ అతడిని ఇస్టపడతారు. అయితే టీం ఇండియా మాజీ క్రికెట్ర్ సుబ్రమణ్యం బ్రదీనాథ్ మాత్రం బుమ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా కంటే యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంతో బెటర్ అని పేర్కొన్నారు చక్రవార్తి గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడని, అందుకే టి-20ల్లో నెం.1 బౌలర్ అయ్యాడని కొనియాడారు.
‘‘వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నెం.1 టి-20 బైలర్ ఎందుకు అయ్యాడో అతడి గణంకాలే చెబుతున్నాయి. అతడు బుమ్రా కంటే ఎక్కువ విలువైనవాడు. పవర్‌ప్లేలో కావొచ్చు, డెత్ ఓవర్లలో కానీ పరుగులు కట్టడి చేయాలంటే కెప్టెన్‌కు గుర్తుకువచ్చే పేరు చక్రవర్తిదే. అతడు ఇప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్. తన అంతర్జాతీయ కెరీర్ అరంభంలో పెద్దగా రాణించకపోయినా.. తన పునరాగమనంలో మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు. టి-20 ప్రపంచకప్ 2026లో అతడు భారత జట్టుకు కీలకం కానున్నాడు. వరుణ్ బంతితో మ్యాజిక్ చేస్తే భారత్‌కు తిరుగుండదు’’ అని సుబ్రమణ్యం అన్నారు.




