
అమరావతి : తాను ఓ మంత్రిగా ఇక్కడకు రాలేదు అని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. బాధ్యత గల భారతీయ పౌరుడిగా వచ్చానని అన్నారు. బిహార్ లో లోకేష్ పర్యటన చేశారు. పాట్నాలో ఎన్ డిఎకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వ్యక్తికి ఎపి ప్రజలు పట్టం కట్టారని, ఐదేళ్లలో ఎపికి వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తీరని నష్టాన్ని మిగిల్చారని మండిపడ్డారు. వైసిపి హయాంలో ఎపిలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, జగన్ పాలనలో పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఎపిని విడిచి వెళ్లారని, అలాంటి పరిస్థితి బిహార్ కు రాకూడదని లోకేష్ కోరారు.




