
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’. దీపావళీ కానుక ఈ అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నరేష్, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జైన్స్ నాని తొలి సినిమాతోనే దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. రాజేష్ దండా, శివ బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మించారు.
అసలు విషయానికొస్తే.. థియేటర్‌లో నవ్వులు పూయించిన ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ ఆహాలో నవంబర్ 15 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘బుర్రపాడు ఎంటర్‌టైనర్’ అంటూ ‘కె-ర్యాంప్’ పోస్టర్‌ను ఆహా ఒక పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. గత ఏడాది ‘క’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న కిరణ్, ఈ ఏడాది ‘కె-ర్యాంప్’తో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఒటిటి వీక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.




