
బ్రిస్బేన్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ది గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదో టి-20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయభేరి మోగించింది. దీంతో ఐదో మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ముఖ్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఒకవేళ ఆసీస్ గెలిస్తే.. సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.




