
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఘట్ కేసర్ పరిధి ఔషాపూర్ వద్ద బస్సు ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టిసి బస్సు కారును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ను ఢీకొంది. బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.




