
ముంబయి: బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ అనే దంపతులు తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తల్లిదండ్రులు కావడంతో వాళ్ల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. విక్కి కౌశల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పడు చాలా సంతోషంగా ఉన్నామని, ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడని తెలిపారు. అభిమానుల ఆశీర్వాదాలు కావాలని కోరారు. ఈ పోస్టుపై పలువురు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు ప్రేమలో మునిగి తేలిన తరువాత 2021లో ఈ జంట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.




