Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedపెద్ది నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..

పెద్ది నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఫస్ట్ షాట్’ విశేషంగా ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పాన్ ఇండియా మూవీని దర్శకుడు బుచ్చిబాబు చిత్రీకరించారు. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ‘చికిరి.. చికిరి’ అంటూ సాగే తొలి సింగిల్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సాంగ్‌లో లొకేషన్లు కానీ, రామ్ చరణ్ డ్యాన్స్‌ కానీ అదిరిపోయాయి. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ అందం ఈ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జానీ మాస్టర్ తనదైన శైలీలో పాటకి స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ పాటకు బాలాజీ లిరిక్స్ అందించారు. ఇక సినిమా విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్.. బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments