
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి, యువకుడు డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. డ్రగ్స్ ఓవర్‌డోస్ తీసుకోవడంతో యువకుడు మృతి చెందగా యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. శివరాంపల్లిలోని కెన్ వరత్ అపార్ట్ మెంట్ లో పాత బస్తీ కాళాపత్తర్ కు చెందిన అహ్మద్, కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి సహజీవనం చేస్తున్నారు. రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇద్దరు రూమ్ లో సేవించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అహ్మద్ మృతి చెందగా యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డ్రగ్స్ హైదరాబాద్ లోని నిలోఫర్ కేఫ్ వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ టెస్ట్ లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు అనే సమాచారాన్ని రాజేంద్రనగర్ పోలీసులు సేకరిస్తున్నారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్ లో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.




