
ఫర్నిచర్ ధ్వంసం, కీలక రికార్డులు చోరీ
ఇంటి దొంగల పనేనని అనుమానం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్
యాదిగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. రాత్రి కార్యాలయంలోని అన్ని రూముల డోర్ల తాళాలు విరగ్గొట్టి చోరికి పాల్పడ్డారు. కార్యాలయానికి సంబంధించి పలు కీలక రికార్డులు చోరీకి గురైనట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించి పలు ఆధారాలు సేకరించింది. సిసి కెమెరాలు పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది ఇంటి దొంగల పనేనని ప్రజలంతా గుసగుసలాడుతున్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తామని మున్సిపల్ కమిషనర్ లింగస్వామి తెలిపారు. నిందితులు ఎవరైనా సరే విడిచిపెట్టమని పోలీసులు స్పష్టం చేశారు.




