
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుషాయిగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడంతో ఆటో డ్రైవర్ మీన్‌రెడ్డి(32) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి పట్టుబడ్డాడు. అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి కుషాయిగూడ ట్రాఫిక్ పిఎస్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు మంటలు ఆర్పేసి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మీన్‌రెడ్డిని దమ్మాయిగూడా వాసిగా పోలీసులు గుర్తించారు. ఆటోను వేరే ఓనర్ నుంచి అద్దెకు తీసుకొని మీన్‌రెడ్డి నడుపుతున్నాడు. శవ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలించారు. పోలీసుల దురుసు ప్రవర్తనే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 120 వచ్చిందని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.




