
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్ ప్రాంతం చునార్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను రైలు ఢీకొట్టింది. 13309 అనే నంబర్ గలం చోపాన్-ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగుతున్న ప్రయాణికులను నేతాజీ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ప్రయాణికులు రాంగ్ వేలో పట్టాలపై వెళ్తుండగా 12311 అనే నంబర్ గల నేతాజీ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. దీంతో నలుగురు దుర్మరణం చెందగా పది మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికి కూడా పట్టాలపై నుంచి దాటడంతోనే ఈప్రమాదం జరిగింది. ప్రయాణికుల నిర్లక్షమే వారి ప్రాణాలు తీసింది.




