
హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్యే అవగాహన ఒప్పందం కుదిరిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యుసఫ్ గూడ డివిజన్ వెంకటగిరిలో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా కాంగ్రెస్, బిఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ, జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.




