Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedనాగచైతన్యకు జోడీగా మీనాక్షి.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

నాగచైతన్యకు జోడీగా మీనాక్షి.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘#NC24’. బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష ఫేం డైరెక్టర్ కార్తీక్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరీ నటిస్తోంది. మంగళవారం మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో దక్ష అనే పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో మీనాక్షి నటిస్తున్నట్లు వెల్లడించారు. మీనాక్షి.. ఓ చీకటి గుహలో భూతద్దంతో ఏదో వస్తువును సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు పోస్టర్ లో చూపించారు. కాగా, ఇంకా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఖరారు చేయలేదు. వర్కింగ్ టైటిల్ ‘#NC24’తోనే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అజనీష్ బి. లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మేకర్స్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments