
సీనియర్ స్టార్ బాలయ్య బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చింది. సోమవారం ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్‌ను వెల్లడిస్తామని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 12:01 గంటలకు హీరోయిన్ అప్ డేట్ రానుంది. తన రాణిని ఆమె వైభవంతో స్వాగతించడానికి యుద్ధభూమి సిద్ధంగా ఉంది. సామ్రాజ్యం.. ఆమె గంభీరమైన, శక్తివంతమైన రాకను చూస్తుంది’ అంటూ పోస్ట్ ను పెట్టారు.కాగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోందని పుకారు ఉంది, కానీ అధికారిక అప్ డేట్ కోసం మనం వేచి ఉండాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కొంత హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా బృందం, దర్శకుడు గోపీచంద్ మలినేని రాజస్థాన్‌లో కోటల రెక్కీలో వున్నారు. ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది” అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 వ ప్రాజెక్ట్ ఇది




