
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కులచర్లలో దారుణం చోటు చేసుకుంది. యాదయ్య అనే వ్యక్తి నిద్రిస్తున్న భార్య, కుమార్తె, వదినను కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తదుపరి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి నుంచి ప్రాణాలతో పెద్దకుమార్తె (13 ), తప్పించుకుంది. కానీ పెద్దకుమార్తెకు తల, చేతిపై కత్తి గాయాలయ్యాయి. యాదయ్య భార్య పిల్లలను తీసుకెళ్లేందుకు వదిన రావడంతో తెల్లవారితే తీసుకెళ్తారని భావించి నిద్రలో ఉన్న వారిని హత్యచేశాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదయ్య దంపతుల మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయని, నలుగురు మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు అలివేలు (32), చిన్న కుమార్తె శ్రావణి (10), వదిన హన్మమ్మ(40) గా గుర్తించారు. పరిగి డిఎస్పి శ్రీనివాస్ వివరాలు సేకరిస్తున్నారు.




