
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ వద్ద మహిళ హత్యకు గురైంది. గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు. తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా మృత దేహం కనిపించింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేరే ప్రాంతంలో చంపి అక్కడ పడేశారని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.




