
హైదరాబాద్: మహిళ ప్రపంచ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. అదీ ఆస్ట్రేలియాపై గెలవడం అంటే వరల్డ్ కప్ సాధించినంత సంబరం. సెమీఫైనల్‌లో 339 పరుగుల లక్ష్యాన్ని చేధించి టీమిండియా రికార్డు సృష్టించింది. వరల్డ్ కప్‌లో నాకౌట్ స్టేజీలో 300 కంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఆసీస్ ఓడిపోయినప్పటి ఆ జట్టు బ్యాటర్ లీచ్ ఫీల్డ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అతి పిన్ని వయసు(22) కలిగిన బ్యాటర్ సెంచరీ చేయడం అనేది ఆమె రికార్డు నెలకొల్పింది. ఇరు జట్లు కలిసి 14 సిక్స్‌లు కొట్టాయి. భారత్ ఐదు, ఆసీస్ తొమ్మిది సిక్స్‌లు బాదాయి. మహిళ వన్డే క్రికెట్ చరిత్రలో 339 పరుగుల లక్ష్యాన్ని చేదించి రికార్డు పుటల్లోకెక్కింది. గతంలో టీమిండియాపై ఆసీస్ 331 పరుగుల చేధించి రెండో స్థానంలో పడిపోయింది. రెండు జట్లు కలిసి 679 పరుగుల చేసి రికార్డుల మోత మోగించాయి. అంతకు ముందు 2017లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా 678 పరుగుల కావడం గమనార్హం. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగో 127 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది.




