
గుజరాత్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఏక్తా దివస్ ను పురస్కరించుకుని పటేల్ విగ్రహానికి అంజలి ఘటించారు. హెలికాప్టర్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు.




