
బెంగళూరు: సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని, కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి చంపేశారు.ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జెపి నగరప్రాంతంలోని శ్రీరామ లేఅవుట్లో ఎనిమిది రోజుల క్రితం దర్శన్ అనే యువకుడు తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మనోజ్ కుమార్- ఆరతి శర్మ అనే దంపతులు కారులో ప్రయాణం చేస్తున్నారు. దంపతుల కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలింది. దీంతో దంపతులు ఇద్దరు యువకులతో గొడవకు దిగాడు. అనంతరం యువకులు బైక్‌పై వెళ్తుండగా రెండు కిలో మీటర్లు వెంబడించారు. కారుతో బైక్‌ను అతివేగంతో ఢీకొట్టారు. వెంటనే అక్కడి కారులో దంపతులు పారిపోయారు. దర్శన్, వరుణ్‌లు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందగా వరుణ్ ఐసియులో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో కారు విడిభాగాలు పడిపోవడంతో దంపతులు ముఖానికి మాస్క్ పెట్టుకొని వాటికి తీసుకెళ్లారు. అక్కడి సిసి కెమెరాలో రికార్డయ్యింది. జెపినగర్ పోలీసులు దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.




