
ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండండి
మొంథా తుఫానుతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్: మొంథా తుఫానుతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావర శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో సోమవారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ కారణంగా తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెండె అలర్ట్ జారీ చేసింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండతో పాటు మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జారీ చేసింది




